
నీట్ ఫలితాల్లో నారాయణ విజయ పరంపర
కర్నూలు ప్రతినిధి , జూన్ 05, (సీమకిరణం న్యూస్) :
నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయి మార్కులలో కర్నూలు నారాయణ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ప్రశంసించింది. కర్నూలు నారాయణ కళాశాల నుండి టి. ఫణిధర్ రెడ్డి 700 మార్కులు, పి. మహమ్మద్ ఇర్పాన్ 685 మార్కులు, జి. తేజస్ సాయి 672 మార్కులు, కె. తన్మయి 670 మార్కులు, జి. జీవన్ కుమార్ రెడ్డి 661 మార్కులు, షేక్ మహమ్మద్ సైఫ్ రోషన్ 658 మార్కులు, కె. ఐశ్వర్య వర్మ 656 మార్కులు, ఎన్.భావికా రెడ్డి 653 మార్కులు, ఎస్. సుమయ 651 మార్కులు మరియు ఇలాంటి మార్కులు మరి ఎన్నో సాధించారు.700 మార్కులు అపైన ఒక్కరు, 650 మార్కుల పైన 9 మంది, 600 మార్కుల పైన 32 మంది, 550 మార్కుల పైన 85 మంది, 500 మార్కులపైన 124 మంది, 450 మార్కుల పైన 181 మంది, 400 మార్కుల పైన 242 మంది విద్యార్థులు సాథించారు.అత్యున్నత ప్రతిభ కనబరచిన విద్యార్థులందరిని నారాయాణ యాజమాన్యం సన్మానించింది. కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి.గోవర్థన్ రెడ్డి, డీన్లు ఆంజనేయ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ కె. హవీల ప్రసాద్, టి.కౌసల్య, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.