ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
టీటీడీ చైర్మన్ రాజీనామాకు ఆమోదం
టీటీడీ చైర్మన్ రాజీనామాకు ఆమోదం
తిరుపతి :
టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. రాజీనామా ఆమోదిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వలవన్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాగా, తిరుపతి అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరుపున పోటీ చేసిన ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే.