
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం హర్షణీయం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు
సీనియర్ న్యాయవాది వై.జయరాజు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై హర్షం వ్యక్తం చేసిన న్యాయవాదులు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన న్యాయవాదులు
సంబరాలు చేసుకున్న న్యాయవాదులు
కర్నూలు లీగల్, జూన్ 14, (సీమకిరణం న్యూస్):
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేయడం హర్షనీయమని సీనియర్ న్యాయవాది వై.జయరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని( టైట్లింగ్ యాక్ట్) రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదులు హృదయపూర్వకంగా స్వాగతించారు. ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సీఎం సంతకం చేయడంతో వారు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కర్నూలు & ఏపీ హైకోర్టు మాజీ అధ్యక్షుడు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ వై.జయరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని( టైట్లింగ్ యాక్ట్) రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే సంతకం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఎంతో మంది ఎదురుచూస్తున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కొనియాడారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, కార్యదర్శి రవికాంత్, ఉపాధ్యక్షులు నిత్యజీవరాజు, మాదన్న, చంద్రుడు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.