విద్యారంగానికి బడ్జెట్లో తీవ్ర అన్యాయం
విద్యారంగానికి బడ్జెట్లో తీవ్ర అన్యాయం
డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ డి ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సురేంద్రబాబు
గోనెగండ్ల , మార్చి 14 , ( సీమకిరణం న్యూస్ ) :
రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి ప్రభుత్వం చేసిన కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ DSF జిల్లా ఉపాధ్యక్షులు సురేంద్ర బాబు మాట్లాడుతూ రూ. 2.56.256 కోట్లు బడ్జెట్లో విద్యారంగానికి స్వల్ప కేటాయింపులు చేశారు ఉన్నత విద్యకు రూ 2.014 కేటాయించారు రాష్ట్రంలో విద్యా దీవెన పథకానికి రూ 2.5000 వేల కోట్లు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది అన్నారు రూ 2.083 కోట్ల స్వల్ప కేటాయింపులు చేసి వసతి దీవెన లో కూడా అన్యాయం చేశారు సెకండర్ విద్యకు కేవలం రూ.27.706 కోట్లు కేటాయించి తీవ్ర అన్యాయం చేశారు అన్ని ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది ఇక బడ్జెట్ కేటాయింపుల్లో ఉద్యోగుల కల్పన కోసం మూలధనం నిధి లేదు అన్నారు సాంఘిక గిరిజన వెనుకబడిన గురుకులాల్లో మెస్ కాస్మోటిక్ ఛార్జీలు కనీస వసతుల కోసం చేసిన కేటాయింపులు తక్కువ అన్నారు అదేవిధంగా ప్రతి డివిజన్ కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు లేదన్నారు విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి అని కనీసo ఆలోచనను ప్రభుత్వం పట్టించుకోలేకపోవడం సిగ్గుచేటు అని DSF నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు