టైటిలింగ్ యాక్ట్ రద్దును స్వాగతిస్తున్నాం
-: సీనియర్ న్యాయవాది వై. జయరాజు
కర్నూలు ప్రతినిధి, జూన్ 14, (సీమకిరణం న్యూస్):
టైటిలింగ్ యాక్ట్ రద్దును స్వాగతిస్తున్నామని సీనియర్ న్యాయవాది వై. జయరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదులు హృదయపూర్వకంగా స్వాగతిం చారని తెలిపారు. ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సీఎం సంతకం చేయడంతో వారు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాము సీనియర్ న్యాయవాది కర్నూలు & ఏపీ హైకోర్టు మాజీ అధ్యక్షుడు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్ట్రా నిక్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది ఎదురుచూస్తున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కొని యాడారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, కార్యదర్శి రవికాంత్, ఉపాధ్యక్షులు నిత్యజీవ రాజు, మాదన్న, చంద్రుడు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.