ఘనంగా పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కర్నూలు ప్రతినిధి, జూన్ 13, (సీమకిరణం న్యూస్):
ఛలో హైదరాబాద్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలు నగర కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం నేషనల్ గోర్ బంజారా సమ్మోలణ్ ముఖ్య కార్యకర్తలతో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల మాట్లాడుతూ మా తండాలో మా రాజ్యం-మేము ఎంత మందిమో మాకు అంత వాటా అనే నినాదంతో 1997 జులై 1 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ సంఘం ఏర్పడి నేటికీ 27 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. సంఘo ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బంజార జాతి ప్రతినిధుల సమావేశం ఉంటుందని తెలిపారు. జిల్లాలోని లంబాడి మేధావులు పెద్దలు, విద్యార్థులు అందరూ కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేణావత్ రాము నాయక్, సేవలాల్ నాగరాజు నాయక్, రామాంజ నేయులు నాయక్, భాషా నాయక్, శ్రీను నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.