మహిళల్లో పెరుగుతున్న గుండె వ్యాధులు
-: మహిళలు.. యువతుల్లో రుతుక్రమం పై అపోహలు వీడాలి
-: సకాలంలో స్పందించకుండా ప్రాణాలకే ప్రమాదం
-: మానవతా మహిళ విభాగం.. కిమ్స్ హాస్పిటల్ సహకారంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు
-: హాజరైన వైద్య బృందం
కర్నూలు ప్రతినిధి, జూన్ 30, (సీమకిరణం న్యూస్):
ఇటీవల కాలంలో ఆహార నియమల్లో మార్పుల కారణంగా పురుషులకంటే మహిళల్లోనూ గుండె సంబంధిత వ్యాధులు అధికమవుతున్నాయని గుండె వైద్య నిపుణులు డా. సందీప్ కుమార్, అరుణలు అభిప్రాయపడ్డారు. కర్నూలు నగరంలోని ఏ క్యాంప్ మాంటిసోరి పాఠశాలలో మానవతా మహిళ విభాగం.. కిమ్స్ హాస్పిటల్ సహకారంతో మెగా వైద్య శిబిరం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి కిమ్స్ ఆసుపత్రి ఆయా విభాగల వైద్యులు డా.దివ్యలత, డా.బాబురావు, కిరణ్ కుమార్, కుసుమ, శిరీష రాణి, విజయరాణి, కిమ్స్ వైద్యశాల మేనేజర్ మోతీ భాష, మానవత మహిళా విభాగం ప్రతినిధులు అపర్ణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన వారికి సకాలంలో (4-5 గంటల మధ్య) చికిత్స అందించినట్లు అయితే వారు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. గుండెపోటు సంభవించిన వారు గతంలో బిపి, షుగర్ వంటి మందులు వాడితే సైడ్ ఎఫెక్టు ఎలా వస్తాయని అపోహ ఉందో.. గుండె పోటు వచ్చినవారు సైతం సకాలంలో మందులు వాడకపోతే ధూమపానంతో కలిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో అంతే స్థాయిలో ఉంటుందన్నారు. న్యూరాలజికి సంబంధించి మెడ, వెన్ను, తలనొప్పి లాంటి బాధలతో వచ్చిన వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి.. వారికి తెరపి సైతం ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మహిళలు.. యువతుల్లో రుతుక్రమం పై అపోహలు వీడాలనీ.. వాటికి సంబంధించి ఎలాంటి వైద్యులను సంప్రదిస్తే తమకు మేలు జరుగుతుందని లోలోన మదన పడుతుంటారన్నారు. అలాంటి వారికి ఇలాంటి వైద్య శిబిరాలు చక్కటి పరిష్కార వేదికలుగా మారుతున్నాయని సంబంధిత వైద్య నిపుణులు సూచించారు.