సురేష్ కుమార్, నాగమణి సుబ్బారెడ్డి ఎన్నిక పట్ల హర్షం
సురేష్ కుమార్, నాగమణి సుబ్బారెడ్డి ఎన్నిక పట్ల హర్షం
ప్యాపిలి, మార్చి 14, (సీమకిరణం న్యూస్) :
అనంతపురం పట్టణంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) 16 వ రాష్ట్ర మహాసభలలో కర్నూల్ జిల్లాకు చెందిన సురేష్ కుమార్, యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులుగా,
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన నాగమణి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా మరియు కర్నూల్ జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన సుబ్బారెడ్డి గారిని యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంగా యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది.హర్షం వ్యక్తం చేసిన వారిలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు నరసింహారెడ్డి,శాంతి ప్రియ,యుటిఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్,మండల శాఖ అధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి,గౌరవాధ్యక్షులు లక్ష్మి నాయక్,బొజ్జన్న,రఘు నాయక్,
శేషయ్య,మోహన్ తదితరులు ఉన్నారు.