కర్నూలు జిల్లా ఎస్పీగా జి. బిందు మాధవ్ బాధ్యతలు స్వీకరించిన సంధర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార ప్రక్రియల శాఖ మంత్రి టీజీ భరత్ ని సంకల్ బాగ్లోని మంత్రి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా అభివృద్ధి అంశాలపై మరియు శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవలసిన పలు అంశాల పై ఇరువురు చర్చించారు.