బడ్జెట్లో రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ఉన్న కేంద్ర బడ్జెట్
యువ నాయకులు నౌషాద్
కర్నూలు ప్రతినిధి, జూలై 24, (సీమకిరణం న్యూస్):
బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్ర అన్యాయం చేసిందని ప్రత్యేక హోదా – విభజన హామీలు ఊసే లేకుండా కేంద్ర బడ్జెట్ ప్రకటించటం ప్రజలను దగా చేయడం వంటిదని యువ నాయకులు నౌషాద్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నుండి 15 వేల కోట్లు సహాయం చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కార్ ఆంధ్రులను మోసం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం చెప్పుచున్న 15 వేల కోట్లు సహాయం అప్పుగా ఇస్తున్నట్టా ! విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ హక్కుగా అమలు చేస్తున్నారో చంద్రబాబు సర్కార్ స్పష్టత ఇవ్వాలని కోరారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవం అయిన ప్రత్యేక హోదా – విభజన హామీల కోసం చంద్రబాబు ఎంపీలు ప్రశ్నించక పోవటం వెనుక చంద్రబాబు సర్కార్ సొంత ప్రయోజనాలు దాగి వున్నాయని తెలిపారు.