బంజారా భాషకు రాజ్యాంగ హోదా కల్పించాలి
-: రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలి
-: ఆంధ్రప్రదేశ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ డిమాండ్
కర్నూలు ప్రతినిధి, జూలై 23, (సీమకిరణం న్యూస్) :
బంజారా భాషకు రాజ్యాంగ హోదా కల్పించడం తో పాటు అందులోని 8వ షెడ్యూల్లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో 18 కోట్ల బంజారాలు ఉన్నారని, లంబాడి బంజారాలు నేటికీ అందరూ తమ భాషను యధావిధిగా కొనసాగిస్తూ వస్తున్నారని తెలిపారు. అలాంటి వారు భాషను గుర్తించి రాజ్యాంగ భాషగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. పకృతి ఒడిలో నివసించే నికార్సైన మనసులు బంజారాలే అన్నారు. నేటికీ తమ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించే వారిలో ముందు వరుసలో ఉంటారని అన్నారు. సింధు నాగరికత నుండి హరప్పా మొహంజదారో కాలం నాటి నుండి నేటి వరకు తమ భాషను కొనసాగించేవారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామితోనే పాచి కలు ఆడే హతి రాంబాబా వారసులు అని ఆయన కొనియాడారు. తమ జాతి నేటికీ గోవులను రక్షించే వారని స్పష్టం చేశారు. పాలకులు తమ భాషను గుర్తించి రాజ్యాంగ హోదా కల్పించినప్పుడే తమ జాతికి ఇచ్చే నిజమైన గౌరవమని కైలాస్ నాయక్ స్పష్టం చేశారు.