తుంగభద్ర నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
కర్నూలు ప్రతినిధి, జూలై 25, (సీమకిరణం న్యూస్) :
ఇటీవల అధిక వర్షాలు కురుస్తున్న కారణంగా తుంగభద్ర డ్యాంలోకి 1,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నాయని, అందువల్ల డ్యాం నుండి దిగువకు సుమారు లక్ష క్యూసెక్కుల నీళ్లు వదలడం జరిగిందని, కాబట్టి తుంగభద్ర నదీ తీరంలో ఉండే గ్రామాల ప్రజలు,లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేసి వారు జాగ్రత్తగా ఉండేలా అప్రమత్తం చేయాలని తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.