ఆలూరు పోలీసుస్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్ / ఆలూరు, జూలై 24, (సీమకిరణం న్యూస్):
ఆలూరు పోలీసుస్టేషన్ ను కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఎళ్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుల పై సత్వరం స్పందించి సేవలు అందించాలని తెలిపారు. సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ గారి వెంట స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజ్ యాదవ్, ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు , ఆలూరు ఎస్సై ఓబులేశు ఉన్నారు.