విద్యార్థి మృతిపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి
నెల్లూరు ప్రతినిధి, జులై 26, (సీమకిరణం న్యూస్):
నెల్లూరులోని కెఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మరణించారన్న విషయం తెలుసుకున్న రాష్ట్రమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమరావతిలోని తన ఛాంబర్లో ఉన్న మంత్రి నారాయణకు ఆ సమయంలో అక్కడే ఉన్న మున్సిపల్ కమీషనర్ సూర్య తేజ. ఈ ప్రమాద విషయాన్ని తెలియజేశారు. పాఠశాలలో గోడ కూలి తొమ్మిదో తరగతి చదువుతున్న గురుమహేంద్ర(14)అనే విద్యార్థి మృతి దురదృష్టవశాత్తూ మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని నెల్లూరు జిల్లా డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని హామీ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. శనివారం తాను నెల్లూరుకు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల చెక్కును అందించనున్నారు.