వెల్దుర్తి మండల ఇన్చార్జి ఎంపీపీగా రంగయ్య
కర్నూలు ప్రతినిధి / వెల్దుర్తి, జూలై 26, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల ఇన్చార్జి ఎంపీపీగా గోవర్ధనగిరి గ్రామానికి చెందిన రంగయ్యను జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు మేరకు నియమించినట్లు వెల్దుర్తి ఎంపీడీవో శివ శంకరప్ప తెలిపారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీపీ ఛాంబర్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నటువంటి ఎంపీపీ సరళ రెడ్డి రాజీనామా చేయడంతో వారి స్థానంలో రంగయ్యకు అవకాశం కల్పించినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. దీంతో ఇన్చార్జి ఎంపీపీని వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీవో శివశంకరప్ప లు శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శైలజ, మండల జడ్పిటిసి సుంకన్న, పట్టణ కన్వీనర్ వెంకట నాయుడు, గోవర్ధనగిరి నక్కిరంగడు, జయరాముడు, కృష్ణాపురం సర్పంచ్ , వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.