పోలీసు పికెట్స్ లలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
వెల్దుర్తి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
• పోలీసు పికెట్స్ లలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
• బొమ్మిరెడ్డి పల్లె పోలీసు పికెట్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్ వెల్దుర్తి ఆగస్టు 01, (సీమకిరణం న్యూస్):
పోలీసు పికెట్స్ లలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు. వెల్దుర్తి పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాలైనా బొమ్మిరెడ్డి పల్లె పోలీసు పికెట్ ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. చెరుకులపాడు, మల్లెపల్లెలో ఏర్పాటు చేసిన పోలీసు పికెట్స్ లలో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. న్యాయం కోసం పోలీసుస్టేష న్ ను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి చట్ట ప్రకారం న్యాయం చేయాలన్నారు. జిల్లా ఎస్పీ గారి వెంట స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజ్ యాదవ్, వెల్దుర్తి సిఐ మధుసూధన్ రావు, ఎస్సై సునీల్ కుమార్ ఉన్నారు.