అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
వెల్దుర్తి పోలీసు స్టేషన్ లో రౌడీషీటర్ లకు కౌన్సిలింగ్ చేసిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్/ వెల్దుర్తి, ఆగస్టు 01, (సీమకిరణం న్యూస్) :
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ రౌడీషీటర్ లకు హెచ్చరించారు. గురువారం వెల్దుర్తి పోలీసు స్టేషన్ లో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ చేసి హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని, సత్ప్రవర్తనతో జీవించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసుల్లో ఇరుక్కొని జైలు పాలై జీవితాలను నాశనం చేసుకోకూడదని, ఆధారపడిన కుటుంబాలు, పిల్లల గురించి ఆలోచించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితోపాటు స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజ్ యాదవ్, వెల్దురి సిఐ మధుసుధన రావు, ఎస్సై సునీల్ కుమార్ పాల్గొన్నారు.