మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే కేఈ ఆర్థిక సాయం
పత్తికొండ టౌన్, ఆగస్టు 02, (సీమకిరణం న్యూస్) :
పత్తికొండ మండలం దూదేకొండ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సురేష్, మణి కుటుంబాలకు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు శుక్రవారం ఆర్థిక సాయం అందించారు. టిడిపి కార్యాలయంలో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించి మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి రూ50వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. టిడిపి నాయకులు సాంబ శివరెడ్డి తదితరులు ఉన్నారు.