ANDHRABREAKING NEWSSPORTSSTATEWORLD
స్పోర్ట్స్ స్కూల్ కు విద్యార్థుల ఎంపిక
స్పోర్ట్స్ స్కూల్ కు విద్యార్థుల ఎంపిక
ప్యాపిలి, మార్చి 14, ( సీమకిరణం న్యూస్) :
ప్యాపిలి మండల పరిధిలోని అలేబాదు తండా ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు స్పోర్ట్స్ స్కూల్ కు ఎంపికయ్యారు. ఈనెల 12వ తేదీన అనంతపురం జిల్లా గొర్లదొడ్డి తండా గురుకుల స్పోర్ట్స్ పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నట్లు హెచ్ఎం బాషా తెలిపారు. పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్న రాజేష్ నాయక్, శ్రీశాంత్ నాయక్, సాయి ప్రసాద్ నాయక్ తదితరులు క్రీడా పాఠశాల కు ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వచ్చే ఏడాది ఏడో తరగతి లో ప్రవేశానికి అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఎంపికైన విద్యార్థులను హెచ్ ఎం తో పాటు ఉపాధ్యాయులు ప్యారయ్య, సుంకన్న నాయక్, ఎస్ఎంసి చైర్మన్ రామ్మూర్తి నాయక్ తదితరులు అభినందించారు.