బాధ్యతలు చేపట్టిన టౌన్ సీఐ శోభన్ బాబు
వినుకొండ, ఆగస్టు 02, (సీమకిరణం న్యూస్) :
పట్టణ సీఐగా యు. శోభన్ బాబు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షిస్తామని, సిబ్బందితో కలసి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, లా & అర్డర్ అమలు చేస్తామన్నారు. ఏవరైనా గోడవలు, దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న, గంజాయి అమ్మకాలు నిర్వహిస్తున్నా, సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.