ఇంకా రూ.7409 కోట్ల 2000 నోట్లు రావాల్సి ఉంది: ఆర్బీఐ
న్యూ ఢిల్లీ, ఆగస్టు 02, (సీమకిరణం న్యూస్):
వాడకం నుంచి తప్పించిన రూ.2 వేల నోట్లు 97.92శాతం తిరిగొచ్చాయని ఆర్బీఐ వెల్లడించింది. ప్రజల వద్ద ఇంకా రూ.7409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ.2 వేల నోటును ఉపసంహరించు కుంటున్నట్లు 2023లో ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ వద్ద ఉండిపోయిన నోట్లను ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం ఉంది. పోస్టు ద్వారా కూడా ఆ కేంద్రాలకు నోట్లను పంపించొచ్చుని ఆర్బీఐ తెలిపింది.