వాలంటీర్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి
వాలంటీర్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి..
రాజమండ్రి / కడియం, మార్చి 14, ( సీమకిరణం న్యూస్) :
ప్రజా సంక్షేమ పధకాలు అన్ని సక్రమంగా అమలు జరిగేలా చూడాలని కడియం మండల ఎంపీడీఓ శ్రీమతి రత్నకుమారి గారు సూచించారు. పొట్టిలంక సర్పంచ్ శ్రీమతి కొత్తపల్లి సత్యవతి వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన పొట్టిలంక పంచాయతిలో సచివాలయం సిబ్బందికి, వాలంటీర్లకు ప్రభుత్వo చేపడుతున్న సంక్షేమ పధకాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, మరియు మధ్యాహ్న భోజన పధకం మరియు అంగన్వాడీ ల పర్యవేక్షణ చేయాలని ఎ ఎన్ ఎం, సంక్షేమ అధికారులకు సూచించారు. త్రాగునీరు సరఫరా, శానిటేషన్ సమస్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సచివాలయం సెక్రటరీ మరియు ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. వీటి మీద ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీ మరియు ఉపసర్పంచ్ ల దృష్టికి తీసుకురావాలని వాలంటీర్లకు సూచించారు.ఏ విధమైన సమస్యలు ఉన్న సచివాలయం లో 3 నుండి 5 గం.ల వరకు నిర్వహించే స్పందన కార్యక్రమం లో అర్జీ పెట్టుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీమతి కె. రత్నకుమారి, పొట్టిలంక వైస్ సర్పంచ్ కుమారి ఈలి రోహిణి, పంచాయితీ కార్యదర్శి ఆర్. వెంకట లక్ష్మీ దేవి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు…