ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ ఖరారు చేసారు. వైసీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి బొత్స సత్య నారాయణను ప్రకటిస్తూ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా వైసీపీ నేతల సమావేశం లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నెల 30వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.