ఆరోగ్య శ్రీ సేవలను బీమా విధానంలోకి మార్చేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ లక్ష్మీ నిన్న సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్ బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశమై ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. వీరి అభిప్రాయాన్ని సేకరించి సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు.