నాణ్యతకు…మన్నికకు కేరాఫ్.. ‘మలబార్ ’
– ఆఫర్లతో ఆకట్టుకుంటున్న ప్రపంచ వాణిజ్య సంస్థ
– సామాజిక సేవలోనూ ముందుంజలో ఉండటం.. అభినందనీయం..
– కర్నూలు షోరూమును పున: ప్రారంభోత్సవంలో – పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 11, (సీమకిరణం న్యూస్):
కొనుగోలుదారుల అభిరుచికి అను గుణంగా బంగారు ఆభరణాలు రూపొందిస్తూ… అందరి మన్ననలు పొందుతున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ.. ప్రపంప వాణిజ్య రంగాలలో ధీటుగా రాణిస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కితాబిచ్చారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు షోరూమును ఆదివారం ఆమె చేతుల మీదుగా పున: ప్రారం భించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు మన్నిక, తరుగు, వజ్రా భరణాల తయారీ తదితర అంశా లను షోరూo నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడుతూ బంగారు ఆభరణాల కొనుగోలు దారుల అభిరుచికి అనుగుణంగా రూపొందించిన బంగారం, వజ్రాలు, పోల్కీ, విలువైన రత్నాలు, ప్లాటినం ఆభరణాలను వివిధ వేడుకలకు మీ బడ్జెట్ కు సరిపోయేలా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ యాజమాన్యం సామాజిక సేవలోనూ ముందు ఉండటం ప్రశంసనీయమన్నారు. కర్నూలు షోరూoను పున: ప్రారంభించిన సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహ్మద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మార్కెటింగ్ హెడ్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ… కస్టమర్ల అభిరుచులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తమ సంస్థ ప్రత్యేకత అన్నారు. బంగారు ధరలో పారదర్శకం, ఆభరణాలకు జీవిత కాల నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి కొనుగోలు చేసినప్పుడు బంగారానికి వంద శాతం విలువ, వందశాతం హెచ్ యూఐడీ (బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ హాల్ మార్కింగ్ ) మార్క్ కలిగిన బంగారు ఆభరణాలు, అంతర్జాతీయ ప్రమాణా లకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత తనిఖీ, ఐజీఐ మరియు జీఐఏ ధృవీకరించిన వజ్రాభరణాలు, బై బ్యాక్ గ్యారెంటీ, బాధ్యతా యుతమైన సోర్సింగ్ మరియు న్యాయబద్ధమైన కార్మిక విధానాలు పాటించడం వంటి ఎన్నో పద్దతులు తమ సంస్థ నిబద్ధతతను నిర్ధారిస్తాయన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.