సీమ ప్రజల గుండెచప్పుడు ” సీమ కిరణం” కావాలి
-: క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్. చంద్ రశేఖర్
కర్నూలు టౌన్, జనవరి 08, (సీమకిరణం న్యూస్) :
సీమ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కథనాలు ప్రచురిస్తూ.. పరిష్కారం చూపే విధంగా అడుగులు వేస్తూ, సీమ ప్రజల గుండె చప్పుడుగా “సీమకిరణo” కావాలని ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్. చంద్రశేఖర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శనివారం
స్థానిక సుంకేసుల రోడ్ లోని కార్తీక్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ లో సీమకిరణం దినపత్రిక క్యాలెండర్ ను దినపత్రిక ఎడిటర్ నజీర్అహ్మద్ బాష , గోవిందు, మరియు జర్నలిస్టులతో కలిసి ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్. చంద్రశేఖర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా జర్నలిస్టులు నిలవడం హర్షించదగ్గ విషయమన్నారు. దిన దినాభివృద్ధి చెందుతూ, పాఠకుల ఆదరాభి మానాలను చూరగొనాలన్నారు. మీడియా రంగం తనదైన పంథాలో కాలంతో పాటు పరిగెడుతూ, ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన కళ్లకు కట్టినట్లు, మన ముందే జరిగినట్లుగా ప్రదర్శిస్తూ, పాఠకులు, వీక్షకులను సొంతం చేసు కోవడం అభినందనీయమని ప్రముఖ ఫిజిషియన్ డాడాక్టర్. చంద్రశేఖర్ అన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యను గుర్తిస్తూ, వాటికి సంబంధించిన ఫోటోతో కూడిన కథనాలు కళ్ళకు కట్టినట్లు ప్రచురిస్తూ.. పరిష్కారం దిశగా పత్రిక ముందడుగు వేయడం గర్వించదగ్గ విషయమన్నారు.