కనువిందు చేసిన ఇంద్రధనుస్సు
ప్యాపిలి, ఆగస్టు 21, (సీమకిరణం న్యూస్) :
సాధారణంగా వర్షం కురిసిన తర్వాత ఇంద్ర ధనుస్సులు ఏర్పడడం సహజమే. కానీ. చాలా సార్లు అవి మనకు స్పష్టంగా కనిపించవు. వాతావరణంలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల ఇంద్ర ధనుస్సులు ఏర్పడతాయి. తాజాగా ఇలాంటి అరుదైన దృశ్యం ప్యాపిలి పట్టణంలో స్థానికులను కట్టిపడేసింది. ప్యాపిలి పట్టణంలో బుధవారం సూర్యోదయం ఉదయించే సమయంలో ఇంద్రధనుస్సు కనువిందు చేసింది. తెల్లవారు జామున ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం కురిసిన అనంతరం ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడింది. సుమారు 20 నిమిషాల పాటు ఉన్న ఇంద్ర ధనస్సు పట్టణ వాసులకు కనువిందు చేసింది. దింతో యువకులు సెల్ ఫోన్లో ఆ చిత్రాన్ని బందించి సోషల్ మీడియా లో వైరల్ చేశారు.