గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ పేరు మార్చడం దారుణం
నెల్లూరు, ఆత్మకూరు, ఆగస్టు 22, (సీమకిరణం న్యూస్) :
ఆత్మకూరు ప్రజల మన్ననలు పొంది విశేష ఆదరాభిమానాలతో రెండు మార్లు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటితో విజయం సాధించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును సంగం బ్యారేజ్ కు పెట్టడం సముచితమని ఆ పేరును మార్చాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం దారుణమని వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు ఆయన గురువారం మాట్లాడుతూ బ్యారేజ్ నిర్మాణ పనులు వేగవంతం చేయడంలో అప్పట్లో మంత్రిగా గౌతమ్ డ్డి విశేష కృషి చేశారన్నారు. చిన్నవయసులోనే మంత్రిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అన్ని రాజకీయ పార్టీల నుంచి మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. అజాత శత్రువుగా గుర్తింపబడ్డారని అటువంటి గౌతమ్ రెడ్డి పేరును బ్యారేజ్ కు తొలగించడం మంచి పరిణామంకాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.