చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ముద్దాయిల అరెస్ట్..
నెల్లూరు, ఆత్మకూరు, ఆగస్ట్ 22,(సీమకిరణం న్యూస్) :
ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామంలో బంకు నిర్వహిస్తున్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసులు తస్కరించిన ఇద్దరు ముద్దాయిలను 48 గంటల్లో సంగం సర్కిల్ ఏఎస్ పేట పోలీసులు పట్టుకున్నారు.. ఈ విషయపై ఆత్మకూరు డిఎస్పీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు డిఎస్పీ తెలిపిన వివరాల మేరకు ఫిర్యాది రాజవోలు గ్రామానికి చెందిన కరేటి పెంచలమ్మ తాను నిర్వహిస్తూ బంకులో కూర్చొని ఉండగా ముద్దాయిలైన బద్దెపూడి నాగేంద్ర తండ్రి సుబ్రహ్మణ్యం 31 పోట్టే పాలెం, మొగిలిగుండ్ల రాజశేఖర్ తండ్రి కోటేశ్వరరావు 26 బోగోలు చెడు వ్యసనాలతో అప్పుల పాలై ఆ డబ్బులు తీర్చడానికి అక్రమ మార్గాలు ఎంచుకొని చైన్స్ మ్యాచింగ్ కి పాలు పడ్డారని ఇద్దరు ముద్దాయిలు ఆత్మకూరు నుండి వింజమూరు వెళ్తూ రాజవోలు లోని పెంచలమ్మ బంకు వద్ద విక్రయించడానికి ఆపి ఒంటరిగా కనిపించిన పెంచలమ్మ మహిళలు గొలుసును లాక్కొని వెల్లగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాది మేరకు వారిపై ప్రైమ్ నెంబర్ 74/ 2024 U s:304(2)307 కింద కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 20 గ్రాముల బంగారం బైకును స్వాధీన పరుచుకున్నట్లు డిఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో సంగం సర్కిల్ సీఐ కే.వేమారెడ్డి, ఏఎస్ పేట ఎస్ఐ కే.ప్రసాద్ రెడ్డి లు పాల్గొన్నారు.. దొంగతనం జరిగిన 48 గంటల్లోనే చేదించి దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి డి.ఎస్.పి అభినందించారు..