
ఏఎస్ పేట లో ఉపాధి కూలీ మృతి
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఆగస్టు 22, (సీమకిరణం న్యూస్):
ఏఎస్ పేట మండల కేంద్రంలో ఉపాధి పనులు చేస్తూ సంఘటన స్థలంలో అస్వస్థతకు గురైన కూలి మృతి చెందాడు. ఉపాధి సిబ్బంది అధికారుల వివరాల మేరకు రోజు వారి పన్నుల్లో భాగంగా గురువారం ఉదయం ఏఎస్ పేట పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలి పనికి స్థానిక ఆనకట్ట వీధికి చెందిన షేక్ ఖాజా మస్తాన్ వెళ్ళాడు. ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అలసిపోయి పడిపోయాడు. వెంటనే 108 వాహనంకు సమాచారం అందించారు. వాహనం వచ్చి తరలించే లోపు మృతి చెందాడని ఫీల్డ్ అసిస్టెంట్ మస్తాన్ తెలిపారు. ఉపాధి కూలీ ఖాజా మస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా పనులు చేస్తున్నాడు. పని ప్రదేశంలో ఖజా మస్తాన్ మృతి చెందడం చూసిన కూలీలు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న ఈసీ నవీన్, ఏపీఓ లు పని ప్రదేశానికి వెళ్లి ఖాజా మస్తాన్ మృత దేహాన్ని పరిశీలించారు. విషయం ఉన్నతాధికారులకు తెలియజేశారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎంపీడీవో
ఉపాధి కూలీ పని ప్రదేశంలో ఓ కూలి మృతి చెందాడని ఎంపీడీవో శ్రీనివాసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి మృతుని కుటుంబానికి అందాల్సిన సహాయాన్ని అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.