ఆత్మకూరులో లైవ్ ఫిష్ షాపి ప్రారంభం
నెల్లూరు, ఆత్మకూరు, ఆగస్ట్ 22, (సీమకిరణం న్యూస్) :
ఆత్మకూరు కేంద్రంగా నాన్ వెజ్ వ్యాపార రంగంలో గత ఏడేళ్ల అనుభవంతో బద్వేల్, నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట ప్రాంతాలలో పలు బ్రాంచ్ లను నిర్వహిస్తూ ప్రజా మన్ననలు పొందిన భాయ్ చికిన్ షాప్ వారి ఆధ్వర్యంలో ఆత్మకూరులో నేడు పచ్చి చేపల వ్యాపారం ఫిష్ ఆంధ్ర పేరిట లైవ్ ఫిష్ అమ్మే పచ్చి, ఎండు చేపల వ్యాపారాన్ని ప్రారంభించారు.. భాయ్ చికెన్ షాప్ ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రధాన కేంద్రంగా నిర్వహిస్తున్న తమ వ్యాపార అభివృద్ధిని విస్తరించే క్రమంలో తమ ఖాతాదారుల కోరిక మేరకు పచ్చి చేపల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు షాప్ నిర్వాహకులు జమీర్ తెలిపారు.. నేడు షాపును ప్రారంభిస్తూ సాంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం పట్టణంలోని అపోలో క్లినిక్ ల్యాబ్ నిర్వాహకులు జనవిజ్ఞాన వేదిక సభ్యులు షేక్ సంధానిచే షాపు ను జనవిజ్ఞాన వేదిక కేసీకృష్ణయ్య ద్వారా ఫిష్ టాబ్ ను రిబ్బన్ కటింగ్ చేయించి ప్రారంభించారు.. షాప్ ఓపెనింగ్ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి భాయ్ చికెన్ షాప్ అధినేతలు జమీర్ భాయ్, మస్తాన్ భాయ్ లు ధన్యవాదాలు తెలుపుతూ తమ షాప్ నందు ప్రజలకు ఉపయోగకరమైన అన్ని రకాల చేపలను, రొయ్యలను మరియు సముద్రపు చేపలను కూడా అందుబాటులో ఉంచుతామని వీటితోపాటు ఎండు చేపలను కూడా తమ నూతన షాపులో అమ్మకం చేపడతామని తెలిపారు… నాన్ వెజ్ వ్యాపార రంగంలో చికెన్ మటన్ వ్యాపారానికి సహకారం చేసిన తమ కస్టమర్లు ఈ చేపల వ్యాపారానికి కూడా సహకారం అందించవలసిందిగా కోరారు..నూతన చేపల షాపు ప్రారంభం సందర్భంగా స్థానిక ప్రజలు హాజరయ్యారు.