
పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటుదాం..
పెద్దహ్యట మండల ప్రాథమిక పాఠశాలలో ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం…
హోళగుంద, ఆగస్టు 23, (సీమకరణం న్యూస్) :
హోళగుంద మండల పరిధిలోని పెద్దహ్యట మండల ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ప్రధానోపాధ్యాయుడు, విద్య కమిటీ చైర్మన్, గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణం చుట్టూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజు నాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్క భారతీయుడు ఒక మొక్క నాటి మన దేశ పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని అన్నారు. చెట్లు మనుషులకు కావలసిన ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది అని ప్రతి ఒక్క భారతీయుడు ఒక మొక్కను నాటి దేశ పర్యావరణ పరిరక్షణ పాటుపడుదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజు నాయక్,పాఠశాల విద్య కమిటీ చైర్మన్ రాము, వార్త విలేఖరి విరుపాక్షి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ,టిడిపి యువ నాయకులు సోమశేఖర్ గౌడ్, కట్టే వీరేష్, రామలింగప్ప, మాజీ విద్యా కమిటీ చైర్మన్ గోపాల్, పాఠశాల విద్య కమిటీ వైస్ చైర్మన్ భర్త హెచ్.వీరభద్ర, నాగేంద్ర, సుంకయ్య, బంగారప్ప, వీరేష్ మారేష్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.