ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు
పట్టించుకోని అధికారులు…
హోళగుంద, ఆగస్టు 26, (సీమకిరణం న్యూస్) :
హోళగుంద మండల కేంద్రంలోని అయోధ్య నగర్ కాలనీలో ఆలూరు రోడ్డు పక్కన గల ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ స్తంభాలు పెచ్చులూడి ఇనుప రాడ్లు తేలడంతో ప్రమాదకరంగా మారాయి. కాలనీవాసులు, మూగజీవాలు సంచరించే ప్రదేశంలో, రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందో అని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి స్తంభాలను మార్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.