సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన డోన్ డీఎస్పీ శ్రీనివాస్
ప్యాపిలి, ఆగస్టు 26, (సీమకిరణం న్యూస్) :
ప్యాపిలి పట్టణంలోని స్థానిక సర్కిల్ కార్యాలయాన్ని డోన్ డిఎస్పి శ్రీనివాస్ సందర్శించారు. డోన్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సర్కిల్ కార్యాలయంను సందర్శించి, సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పనితీరు వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయని అలాగే మండల పరిధిలోని బౌగోలిక పరిస్థితులు ముఖ్యమైన ప్రదేశాలు గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టణ సమీపంలోని ఫంక్షన్ హల్ నందు కొళాయి పైప్ లైన్ కోసం ఆర్ అండ్ బి రోడ్డును గుంతలు తీయడంతో ఆర్ అండ్ బి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫంక్షన్ హల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు అక్రమంగా వేసిన బంకును తొలగించాలని, ట్రాఫిక్ సమస్యపై మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక నిఘా ఉంచాలని సీఐ ని ఆదేశించారు. వీరి వెంట ప్యాపిలి సీఐ వెంకట రామిరెడ్డి, డోన్ సీఐలు సిఏం రాకేష్, ఇంతియాజ్ బాషా వున్నారు.