కర్నూలు ముఖచిత్రం మారుస్తాం : బి.వై. రామయ్య

కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య
కర్నూలు కలెక్టరేట్, మార్చి 15, (సీమకిరణం న్యూస్) :
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఎంతగానో ఇష్టమైన కర్నూలు నగర ముఖచిత్రాన్ని మారుస్తామని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య తెలిపారు. మంగళవారం గాయత్రీ ఎస్టేట్ సర్కిల్లో నగర పాలక సంస్థ నిర్మిస్తున్న క్లాక్ టవర్ ను ఆయన పరిశీలించారు.డీఈఈ రాజశేఖర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో పది కోట్ల పదమూడు లక్షలతో నగర సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా గాయత్రీ ఎస్టేట్ సర్కిల్లో 25 లక్షలతో క్లాక్ టవర్ నిర్మిస్తున్నామని, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన కరోనా వారియర్స్ డాక్టర్ మరియు నర్సు, పోలిస్, మున్సిపల్ సానిటేషన్ నమూనాలు క్లాక్ టవర్లో ఉంటాయన్నారు.ఈ నెల 18న క్లాక్ టవర్_ను ప్రారంభిస్తామని, అశోక్ నగర్ పార్కులో నిర్మిస్తున్న పైనాపిల్ పౌంటేషన్, స్టాబేరి ఫ్రూట్ ను ఇతర సుందరీకరణ పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఇచ్చిన స్ఫూర్తితో నగరాన్ని వేగంగా మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. నగరంలో ఆరోగ్యంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు జీవనం సాగించడమే తమ అభిమతమన్నారు.కర్నూలు నగరం రోజురోజుకూ విస్తరిస్తూ దినదినాభివృద్ది చెందుతుందని, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా త్వరలో కర్నూలు నగరంలో తాగినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో 1వ కార్పొరేటర్ షాషావలి, కాంట్రాక్టర్ కళ్యాణ్ పాల్గొన్నారు