BREAKING NEWSCRIMEPOLITICSSTATETELANGANA
వినాయకచవితి మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
వినాయకచవితి మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి : జిల్లా ఎస్పీ
“Seema Kiranam Telugu News”
Aug 28, 2024,
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కొమురంభీం జిల్లాలో గణేష్ విగ్రహాలను ప్రతిష్టించడం, మండపాలు ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని జిల్లా ఎస్పీ డీవు శ్రీనివాస రావు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు గణేష్ నవరాత్రిని భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని, ఎటువంటి అల్లర్లు లేదా గొడవలు జరుగకుండా చూడాలని సూచించారు. పోలీసుల సూచనలను పాటించాలన్నారు.