హొళగుంద, ఆగస్టు 28, (సీమకిరణం న్యూస్) :
హొళగుంద మండల కేంద్రంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శేషప్ప యొక్క షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విరూపాక్షి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ షఫీయుల్ల, ఎంపీపీ తనయుడు ఈసా, వైస్ ఎంపీపీ సింధువాలం హనుమప్ప,మాజీ సింగల్ విండో చైర్మన్ మల్లికార్జున,యువ నాయకుడు గిరి,ఎంపిటిసిలు మల్లికార్జున,మల్లయ్య,వార్డు మెంబర్ బాషా, సర్పంచ్ తనయుడు పంపాపతి, మండల వైసిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.