జిల్లా టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు బహుమతి అందించిన ఎమ్మెల్యే
హొళగుంద, ఆగస్టు 28, (సీమకిరణం న్యూస్):
హొళగుంద మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే విరుపాక్షి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. అదే విధంగా కళాశాలలో విద్యనభ్యసిస్తున్న జే.మేఘన అనే విద్యార్థిని సీఈసీ మొదటి సంవత్సరంలో జిల్లా టాపర్ గా నిలిచినందుకు గాను ఎమ్మెల్యే విరూపాక్షి విద్యార్థినిని అభినందించి పదివేల రూపాయలు బహుమతిగా అందించారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని రాష్ట్రంలో మొదటి స్థానం సాధించి హొళగుంద మండలానికి, ఆలూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొని రావాలని తెలిపారు. ఈ విధంగా సాధించి మంచిగా చదువుకునే వారికి నేను ఎల్లప్పుడు మంచి ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకొని రావాలని, ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు.