వింత వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి
రెక్క ఆడితే కానీ డొక్కాడని ఆ కుటుంబంలో కష్టం వచ్చింది…
వింత వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి..
ప్రభుత్వం స్పందించి మంచి వైద్య సదుపాయాలు కల్పించాలని వేడుకుంటున్న కటికే చాంద్ బాషా…
గోనెగండ్ల , ఆగస్టు 29 , (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన కటిక చాంద్ బాషా హుస్సేన్ బి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు. హోటల్లో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని చాంద్ భాషా పోషించుకుంటున్నాడు. పెద్ద కూతురు అస్మత్ బి 9 సంవత్సరాలు వింత వ్యాధితో బాధపడుతుంది ఆమె లేవలేదు కూర్చోవలేదు స్తోమతకు మించి వైద్యుల వద్ద చూపించిన వ్యాధి నయం కాలేదు.
సీమకిరణం న్యూస్ ప్రత్యేక కథనం…
తిరుపతిలో వైద్యులు మూడు నెలల తర్వాత శాస్త్ర చికిత్స చేస్తామన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ పింఛన్ మాత్రమే అందిస్తుందని చాంద్ బాషా తెలిపారు రెక్క ఆడి తే కాని డొక్కాడని ఆ కుటుంబంలో కూతురుకు ఇలా అవ్వడంతో ఇక్కడ పని చేసుకోవాలి మళ్లీ ఆ పసిపాపను చూసుకోవాలి అస్మత్ బి ను చూసుకోవడం కోసం ఒక మనిషి ఇంట్లోనే ఉంటున్నామన్నారు అయినా శక్తికి మించి ఖర్చుపెట్టి వైద్య సేవలు అందిస్తున్నామని దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మంచి వైద్య సదుపాయాలు కల్పించి తన కూతుర్ని నయమయ్యే మార్గం చూపించాలని వేడుకుంటున్నారు అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వైద్య ఖర్చులకోసం ఆపన్న హస్తంగా ఆదుకోవాలని కోరుకుంటున్న చాంద్ బాషా…. స్పందించే హృదయాలు ఎవరైనా ఉంటే కటికి చాంద్ బాషా కుటుంబానికి ఆదుకోవాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం….