జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వినాయకుడికి పూజలు
కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 07, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక స్వామికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు మాట్లాడుతూ ఈ పండుగను జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. హిందువులకు ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి పెద్ద పండుగ.హిందూ సోదరులు కుటుంబ సభ్యులతో ఈ పండుగను ఆనందంగా జరుపుకొని గణనాధుని కృపకు పాత్రులు కాగలరని 9 రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాలలో కుల మత భేదం లేకుండా అందరూ కలిసి ప్రతి వీధిలో వినాయకుని విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేసుకోవడం సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా ఆనందంగా జరుపుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. అధికారులు చొరవ తీసుకొని వినాయకుని విగ్రహాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించగలరని బాబురావు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ, పిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, కోఆర్డినేషన్ చైర్మన్ అనంతరత్నం, డిసిసి ఉపాధ్యక్షులు వెంకట రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముర్షిద్ పీర్ ఖాద్రి, మైనార్టీ సెల్ సిటీ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, డిసిసి కార్యదర్శి బి సుబ్రహ్మణ్యం, ఎస్సీ సెల్ డబ్ల్యూ సత్యరాజు, కాంగ్రెస్ నాయకులు రజాక్ వలి, పసుపల ప్రతాపరెడ్డి కేశవరెడ్డి సుంకన్న, ఐ ఎన్ టి యు సి నాయకులు రేపల్లె ప్రతాప్, మహిళా కాంగ్రెస్ సాయి భార్గవి, మద్దమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.