జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా పరిగెల మురళీ కృష్ణ
కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 07, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మాజీ తిరుమల తిరు పతి దేవస్థానం పాలకమండలి సభ్యులు పరిగెల మురళీకృష్ణ నియమితులయ్యారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మురళీకృష్ణను అఖిలగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ నియమించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో అధ్యక్షులుగా నియమించినందుకు జాతీయ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, యువ నాయకులు రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, జాతీయ,రాష్ట్రస్థాయి నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీని నాయకులు కార్యకర్తలను అందర్నీ కలుపుకొని పార్టీని ముందుకు నడుపుతానని దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త లక్ష్యమని తెలిపారు.