విజయవాడ, సెప్టెంబర్ 07, (సీమకిరణం న్యూస్): విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం తాను ప్రకటించిన రూ.1 కోటి చెక్‌ను సీఎంకి అందజేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మంటపంలో ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.