ANDHRABREAKING NEWSCRIMESTATE
రోడ్డుపైనే వర్షపు నీరు
రోడ్డుపైనే వర్షపునీరు
పట్టించుకోని అధికారులు
హొళగుంద, సెప్టెంబర్ 07, (సీమకిరణం న్యూస్):
హొళగుంద మండల పరిధిలోని పెద్దగొనెహల్ గ్రామం లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షపు నీరు రోడ్డుపైనే నిలుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనిల్లో డ్రైనేజీలు, సిసి రోడ్డు లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. సంబంధిత గ్రామ,మండల అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.