రక్తదాన శిబిరానికి విశేష స్పందన
హోళగుంద, సెప్టెంబర్ 7, (సీమకిరణం న్యూస్) :
హోళగుంద మండల పరిధిలోని యం.డి.హళ్లి గ్రామంలో సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో ఆదోని గోపి చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఎండి హళ్లి ఎంపీపీ స్కూలు ఆవరణము నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని సర్పంచ్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా రక్త దానం గొప్పదని , మనమిచ్చే రక్తం ఇంకొకరి జీవితాన్ని నిలబెడుతుందని అన్నారు .ప్రతి ఒక్క యువకుడు రక్త దానం చేయాలనీ కోరారు. రక్తదాన శిబిరంలో మొత్తం 32 మంది రక్త దానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంగలదహాల్ యువకులు మల్లి ,సుభాన్ ,హనుమంతు , పెద్ద గోనేహాల్ యువకులు మంథేష్ , సురేష్ , యం.డి.హళ్లి నాయకులు నాగరాజు ఈరన్న ,చంద్ర ,పరమేష్ , చిన్న స్వామి , శీను , బ్లడ్ ఆర్గనైజేర్ విరూపాక్ష స్వామి తదితరులు పాల్గొన్నారు.