తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ జ్యోతి విజయవాడ వరద బాధితులకు విరాళంగా లక్ష రూపాయలను ఆర్థిక సహకారం అందించారు. వరద బాధితులకు సహాయం అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సెక్రటేరియట్ లో మంత్రి నారా లోకేష్ ను కలిసి లక్ష రూపాయల చెక్కును అందించారు. వరద బాధితుల సహాయార్థం విరాళం అందించిన వైకుంఠం దంపతులను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.