ఇళ్ల నిర్మాణాల పనులు ముమ్మరం చేయండి

ఇళ్ల నిర్మాణాల పనులు ముమ్మరం చేయండి
బిలో బేస్మెంట్ లెవెల్ లో ఉన్న ఇళ్లన్నీ పునాది స్థాయికి రావాలి
గార్గేయపురం సమీపంలోని జగనన్న కాలనీ లేవుట్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
కర్నూలు కలెక్టరేట్, మార్చి 15, (సీమకిరణం న్యూస్) :
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాల పనులు ముమ్మరం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు ఆదేశించారు. మంగళవారం కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం గ్రామ సమీపంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీ లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణాలు పురోగతిని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా గార్గేయపురం గ్రామ సమీపంలో జగనన్న కాలనీ లేవుట్ లో తాగునీటి సదుపాయను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా ఈ లే అవుట్ ఎన్ని ఎకరాలు, ఎన్ని ప్లాట్లు, ఎంతమంది లబ్ధిదారులు, ఇప్పటివరకు ఎన్ని ఇల్లులు ప్రారంభించారు, అవి ఏ దశలో ఉన్నాయి వంటి వివరాలు అడిగి తెలుసుకొని పరిశీలించారు. బిలో బేస్మెంట్ లెవెల్ లో ఉన్న ఇళ్లన్నీ పునాది స్థాయికి రావాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానిక పెద్దల సహకారం తీసుకొని లబ్ధిదారులను మోటివేషన్ చేసి ఈ లే అవుట్ లో ప్రతి ఒక్కరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇంటి నిర్మాణం కావలసినటువంటి సామాగ్రి అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టాలని లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ సూచించారు.