విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 25, (సీమకిరణం న్యూస్):
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు జిల్లా ఇంటర్ కళాశాలల బాలికల రగ్బీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటిల్లో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేసేందుకు ఈ పోటీలను రగ్బీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఏర్పడుతుందన్నారు. క్రీడాకారులు మంచి ఆహరపు అలవాట్లు అలవరుచుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఏరాష్ట్రంలో అయితే మహిళలు ఎక్కువగా చదువుకుంటారో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు.