BREAKING NEWSTELANGANA

కనుల పండుగగా సాగిన చక్రం వేలం పాట

కనుల పండుగగా సాగిన జై దుర్గామాతాది ఆధిపత్య చక్రం వేలం పాట

ఓమౌజయాః ఏకోపాసన మహా ధర్మం ఆధ్వర్యంలో మూడవ సంవత్సరం కనుల పండుగగా సాగిన జై దుర్గామాతాది ఆధిపత్య చక్రం వేలం పాట

వేలం పాటలో జై దుర్గామాతాది ఆధిపత్య చక్రాన్ని రూ.2,11,000 కి సొంతం చేసుకున్న దంపతులు బోయినపల్లి భక్తోమౌజయులు శ్రీమహా వెంకట సుబ్బయ్య, మహాశ్రీ వెంకట సుబ్బమ్మ

హైదరాబాద్, అక్టోబర్ 11, (సీమకిరణం న్యూస్) :

ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి సందర్భంగా ఓమౌజయా: ఏకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో జై దుర్గామాతాది ఆధిపత్య చక్రం(మహాదేవి ఆధిపత్య చక్రం) వేలం పాట నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం వేలం పాటను ఓమౌజయాః శ్రీ భవతి క్షేత్రం నిర్వహకులు శ్రీ పరమోజీ శ్రీఋషి ప్రజ్ఞానంద స్వామీజీ, ఓమౌజయాః ప్రజ్ఞాన క్షేత్రం నిర్వహకులు శ్రీ పరమోజీ త్రిగుణాత్మక సిద్ధ, ఓమౌజయాః శ్రీభవతి క్షేత్రం పాలక మండలి అధ్యక్షులు శ్రీమహా భవ సింగ్, తదితర పాలకమండలి సభ్యులు, సైనిక దళ్ సమక్షంలో ఓమౌజయాః ప్రజ్ఞాన క్షేత్రం, వెంకటాపూర్ గ్రామ శివారు, ఎల్లారెడ్డి పేట (మం) రాజన్న సిరిసిల్ల (జి) తెలంగాణలో శుక్రవారం ఆన్లైన్ జూమ్ ద్వారా వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో వివిధ ప్రాంతాల భక్తోమౌజయులు పాల్గొని శ్రీశ్రీశ్రీ పరమ పూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి దివ్యానుగ్రహముతో మహాదేవి ఆధిపత్య చక్రం 108 (5 రూపాయల కాయిన్స్) 540 రూపాయలు వేలంలో భక్తిని చాటుకునే విధంగా వేలం పాటను పాడారు. అత్యధికంగా హైదరాబాద్ కి చెందిన బోయినపల్లి ఓమౌజయాః సేవా సమితి సభ్యులు, అధ్యక్షురాలు దంపతులు శ్రీమహా వెంకట సుబ్బయ్య, మహాశ్రీ వెంకట సుబ్బమ్మ వారి కుటుంబ సభ్యులు రూ.2,11,000 అక్షరాలా రెండు లక్షల పదకొండు వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ కాయిన్స్ పొందిన వారికి మహాదేవి ఆధిపత్య చక్రం ప్రాప్తిస్తుందని సద్గురువు ఓమౌజయా వారి ఆజ్ఞగా గెలిచిన భక్తోమౌజయులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వేలం పాటలో పరార్థ ఓమౌజయులు, సత్య ఓమౌజయులు, వివిధ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!