BREAKING NEWSCRIME

పోలీస్ స్టేషన్ లలో ఘనంగా ఆయుధ పూజలు 

పోలీస్ స్టేషన్ లలో ఘనంగా ఆయుధ పూజలు

ప్యాపిలి, అక్టోబర్ 11, (సీమకిరణం న్యూస్ ) :

ప్యాపిలి మండలంలోని ప్యాపిలి, జలదుర్గం, రాచర్ల పోలీస్‌ స్టేషన్‌ లలో ఆయుధపూజను సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్యాపిలి ఎస్ఐ మధుసూదన్,జలదుర్గం ఎస్ఐ నాగర్జున ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్లో గల వాహనాలు, బైక్‌లు, కంప్యూటర్లు, తుపాకులు, ఇతర వస్తువులను పేద పండితుల మంత్ర ఉచ్చారణతో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ ఏడాది మండల పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామరస్యమైన జీవితాన్ని ప్రజలు గడపాలని కోరి మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ ల సిబ్బంది పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!