మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు : ఎస్సై నాగార్జున
ప్యాపిలి, అక్టోబర్ 10, (సీమకిరణం న్యూస్) :
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై నాగార్జున హెచ్చరించారు. ప్యాపిలి మండలం జలదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బావి పల్లె సర్కిల్ నందు ఎస్ఐ నాగార్జున వారి సిబ్బందితో గురువారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా హెల్మెట్ లేని వారికి, సీట్ బెల్ట్ పెట్టుకోని వారికి సరైన పత్రాలు లేని వారికి మూడువేల రూపాయల చలానాలు విధించి రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనదారుల సురక్షితంగా గమ్యస్థలం చేరుకోవాలని సూచించారు.